
వినుకొండ మండలం పసుపులేరు బ్రిడ్జి సమీపంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను, ముఖ్యంగా తల్లులను ఎంతో ఆకట్టుకున్నాయి.

కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా సినీ నటులు, జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ బృందం పాల్గొని తమ వినోదాత్మక ప్రదర్శనలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. వారి ప్రదర్శనలు సభలో సందడి నింపాయి.

ఈ కార్యక్రమానికి వినుకొండ మున్సిపల్ చైర్మన్ షైక్ షకీలా దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరై మహిళా దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. మహిళల సాధికారత సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ఈ వేడుకలకు పలువురు ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు మహిళా దినోత్సవ విశిష్టతలు, మహిళల పాత్ర గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.







