పాము కాటుకు మృతి చెందిన పద్మా బాయి
పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో పాము కాటుకు గురై మహిళా రైతు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన మేరా జ్యోతి పద్మబాయి (35) సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు నీరు పెడుతున్న సమయంలో పాము కాటేయడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు.
ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సాయంతో వినుకొండ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు సమాచారం.
పద్మబాయి భర్త శ్రీనివాస్ నాయక్తో కలిసి కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది

.







1 thought on “పాము కాటుకు మహిళా రైతు మృతి”
Comments are closed.