
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రజలు వీక్షించారు.
ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని 45,898 మంది రైతులకు రూ.25.62 కోట్లు ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీవీ తెలిపారు. అనంతరం రైతులకు పథకం చెక్కులను అందజేశారు.
కార్యక్రమానికి ముందు నూజెండ్ల గ్రామంలో నిమ్మ తోటను సందర్శించిన ఆయన సాగు పరిస్థితులు, పంట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, అధికారులు, స్థానిక నాయకులు వీరితోపాటుగా రైతులు పాల్గొన్నా
రు.







