
వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అయితే మార్కెట్లో మంచి తీపి ఉన్న పుచ్చకాయను గుర్తించడం చాలామందికి కష్టంగా ఉంటుంది. కొన్ని సాధారణ లక్షణాలు గమనిస్తే మంచి కాయను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.
పుచ్చకాయ కింద భాగంలో కనిపించే మచ్చ పసుపు లేదా నారింజ రంగులో ఉంటే అది పండిన కాయగా భావిస్తారు. అదే మచ్చ తెల్లగా ఉంటే కాయ పూర్తిగా పండకపోయిన అవకాశముంది. సాధారణంగా గుండ్రంగా ఉన్న పుచ్చకాయలు ఎక్కువ తీపిగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
https://villagenews.in/epuru-kochcharla-woman-farmer-snake-bite-death/
ఒకే పరిమాణంలో ఉన్న కాయల్లో బరువు ఎక్కువగా ఉన్నదాన్ని తీసుకోవడం మంచిది. అటువంటి కాయల్లో గుజ్జు మరియు రసం ఎక్కువగా ఉండే అవకాశముంది. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి ఉండటం, పైభాగం మెరుపు తక్కువగా ఉండటం వంటి లక్షణాలు సహజంగా పండిన కాయలకు సూచనగా భావిస్తారు.
అదేవిధంగా పుచ్చకాయపై గోధుమ రంగు గీతలు కనిపిస్తే అవి సాధారణంగా మంచి తీపి కలిగి ఉంటాయని పండ్ల వ్యాపారులు సూచిస్తున్నారు. కొనుగోలు సమయంలో ఈ లక్షణాలు గమనిస్తే మంచి పుచ్చకాయను ఎంపిక చేసుకోవచ్చు.








1 thought on “పుచ్చకాయ కొనేముందు ఇవి తెలుసుకోండి”
Comments are closed.