
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడటంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఈ సిలిండర్ల నిలిపివేతతో పలుచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.
అయితే ప్రస్తుతం LPG ఉత్పత్తిని పెంచిన నేపథ్యంలో పరిస్థితి మెరుగుపడినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల డిస్ట్రిబ్యూషన్‌ను తిరిగి ప్రారంభించినట్లు కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
పుచ్చకాయ కొనేముందు ఇవి తెలుసుకోండి
https://villagenews.in/puchchakaya-konetaappudu-suchanalu/
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సరఫరా ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ముందుగా పంపిణీ జరుగుతుందనే విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరాన్ని బట్టి దశలవారీగా ఇతర రాష్ట్రాలకు సరఫరా విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
గ్యాస్ కొరత సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం LPG ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని భావిస్తున్నా
రు.







