Dr. Gottipati Lakshmi talking to farmers in the constituency
దర్శి మండలం శామంతపూడి గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితోపాటుగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. “అన్నదాత సుఖీభవ” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం ఇచ్చి, ఎకరాకు లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో పశుసంవర్థక రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.








