
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై బెనిఫిట్ షో అనంతరం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని సినిమా చూసిన వారు చెబుతున్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అభిమానులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన చెప్పే పదునైన మాస్ డైలాగ్స్ థియేటర్లలో హోరెత్తిస్తున్నాయని తెలిపారు. కొన్ని సీన్స్‌లో పవన్ డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్లుగా మారాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రతి సీన్లో హీరో ఎలివేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చారని, ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని అన్నారు.
అయితే కథ పరంగా కొత్తదనం లేకపోవడం కొంతమందిని నిరాశకు గురి చేసింది. కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, ముందే ఊహించగలిగే విధంగా సాగడం మైనస్‌గా మారిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రేక్షకులు కథ కంటే మాస్ ఎలిమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
మొత్తంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలా ఉంటుందని, కానీ కథలో కొత్తదనం ఆశించిన వారికి మాత్రం సాధారణ అనుభూతి ఇస్తుందని పబ్లిక్ టాక్ వెల్లడిస్తోంది.






