
నూజెండ్ల : నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారితే వారి జీవితం బంగారుమయం అవుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పావులూరి ఉమాదేవి తెలిపారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా వయోజనులతో మమేకమై మాట్లాడుతూ మహిళలందరూ చదవడం, రాయడం మాత్రమే కాకుండా కూడికలు, తీసివేతలు కూడా నేర్చుకోవాలని సూచించారు. మహిళలు చదువుకున్నప్పుడే వారి కుటుంబాలు ఆర్థికంగా మరియు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ సూపర్వైజర్ కన్నెబోయిన వెంకటేశ్వర్లు, జడ్డా రామయ్య, వాలంటీర్లు పాల్గొన్నారు






