
వినుకొండ:రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా కొనసాగించేలా కూటమి ప్రభుత్వం 2026–27 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.₹3,32,205 కోట్ల బడ్జెట్లో వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. రైతు ఆదాయం పెంపు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.వెనుకబడిన వర్గాల సంక్షేమానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు కేటాయించిన నిధులు రైతులకు మేలు చేస్తాయని చెప్పారు. విద్యా రంగం, పంచాయతీ రాజ్, సాగునీటి ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.గతంలో నిలిచిపోయిన కేంద్ర–రాష్ట్ర పథకాలను తిరిగి అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పల్నాడు ప్రాంతానికి ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.








