ఐదు లక్షల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే బూచేపల్లి
దర్శి నియోజకవర్గంలోని కురిచేడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సొసైటీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రూ.5 లక్షలు అందజేశారు. ఈద్గా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను అందించినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోవడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈద్గా అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సొసైటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు

.







