
వినుకొండ:వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యం గ్రౌండ్స్‌లో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగిన BVH ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు. క్రీడాకారుల ప్రతిభను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు.







