
వినుకొండ, పల్నాడు జిల్లా:స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులకు బ్యాంకు రుణాల మంజూరు చెక్కును సీఎం చేతుల మీదుగా అందించారు. మొత్తం రూ.100.14 కోట్ల ఆర్థిక సహాయాన్ని 561 స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు.







