
వినుకొండ:స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వినుకొండ పట్టణాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ అభివృద్ధికి పలు కీలక హామీలు ఇచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు.వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వెటర్నరీ మరియు అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు, ఎన్ఎస్పీ స్థల అభివృద్ధికి నిధుల మంజూరు, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.వినుకొండ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ నిర్ణయాలు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జీవి ఆంజనేయులు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.







