
పల్నాడు జిల్లా వినుకొండలో ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికిన అనంతరం ప్రజా వేదిక (ఎన్ఎస్పీ గ్రౌండ్స్)కు వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొని స్వచ్ఛాంధ్ర రథానికి జెండా ఆవిష్కరణ చేయడంతో పాటు ఏర్పాటు చేసిన అభివృద్ధి స్టాల్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తర్వాత మధ్యాహ్నం 3:05 గంటలకు క్యాడర్ సమావేశ వేదికకు చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4:40 గంటలకు వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 5:10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి తదుపరి కార్యక్రమాలకు బయలుదేరనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.







