
వినుకొండ, పల్నాడు జిల్లా:స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఇటీవల కాన్పు అయిన నాగేశ్వరి, నేత్రావతి అనే బాలింతలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారికి జన్మించిన నవజాత శిశువులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు.తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు మరియు సిబ్బంది పనితీరుపై బాలింతలు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో కలియ తిరిగి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే దిశగా అధికారులు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.







