
దర్శి పట్టణంలో మార్చి 10వ తేదీ మంగళవారం నిర్వహించనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల మహోత్సవ కార్యక్రమానికి రావలసిందిగా స్థానిక టిడిపి నాయకులు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీని ఆహ్వానించారు.
ఆదివారం దర్శిలోని టిడిపి కార్యాలయంలో ఆమెను కలిసి మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ను వీరితోపాటుగా ఆహ్వానించారు.
తిరుణాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ కమిటీ మరియు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, స్వామివారి ఊరేగింపు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్, తిరుమల వెంకటేశ్వర్లు (బిర్లా), సానే సుబ్బయ్య, కనకం సైదా వీరితోపాటుగా ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నా
రు.






