
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గుండాల స్వెనోమ్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.యస్. జగన్మోహనరెడ్డి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కు పంపినట్లు వెల్లడించారు.
తన రాజీనామా వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేదా అంతర్గత విభేదాలు లేవని, పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వెనోమ్ పేర్కొన్నారు. అయితే ఆయన రాజీనామా భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే దానిపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆయన తదుపరి రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇవ్వలేదు. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా రాజకీయాలకు పూర్తిగా విరామం ఇవ్వాలనుకుంటున్నారా అన్న విషయంపై ఆయన మౌనం పాటిస్తున్నారు. దీనితో ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
మొత్తంగా గుండాల స్వెనోమ్ రాజీనామా వినుకొండ పట్టణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఆయన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు, భవిష్యత్ రాజకీయ దిశ ఏంటి అన్నది త్వరలో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.






