
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఇండియా – న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
సంజు సామ్సన్ అద్భుతంగా ఆడి 46 బంతుల్లో 89 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేసి వేగంగా రాణించారు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు.
చివర్లో శివమ్ దుబే 8 బంతుల్లో 26 పరుగులతో వేగంగా పరుగులు జోడించారు. తిలక్ వర్మ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీసుకోగా, మ్యాట్ హెన్రీ ఒక వికెట్ దక్కించుకున్నారు.
దీంతో న్యూజిలాండ్ జట్టు విజయానికి 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.







