
కొండవీడు: చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొండవీడు ఫెస్ట్–2026 కార్యక్రమం ప్రజల విస్తృత భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండవీడు కోట చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఫెస్ట్ ముఖ్యమైన వేదికగా నిలుస్తోందన్నారు. కార్యక్రమం ప్రజల ఆదరణతో విజయవంతం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








