
కొండవీడు ఫెస్ట్ తొలి రోజు సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణంలో సాగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమాలకు హాజరై కళాకారుల ప్రదర్శనలను వీక్షించి అభినందించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.స్థానిక కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. యువత, కుటుంబాలతో వచ్చిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాలను ఆస్వాదించారు. ఫెస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైటింగ్, అలంకరణలు వేడుకకు మరింత శోభను తీసుకువచ్చాయి.కొండవీడు చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌కు మొదటి రోజే మంచి స్పందన లభించగా, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.








