
పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశమైన కొండవీడులో నిర్వహించిన కొండవీడు ఫెస్ట్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ మాట్లాడుతూ, తెలుగు జాతి ఔదార్యం, సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలిచిన కొండవీడుకు పునర్వైభవం తీసుకురావడానికి చేపడుతున్న అభివృద్ధి పనులపై సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, రోడ్లు మరియు భవనాల మంత్రి జనార్దన్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.








