ఇఫ్తార్ విందులో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే
కురిచేడు: ప్రకాశం జిల్లా కురిచేడు మదర్సాలో వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వీరితోపాటుగా కార్యక్రమానికి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యన్నబత్తుల సుబ్బయ్య, మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ షేక్ ఖాసిం, జడ్పిటిసి నుసుం నాగిరెడ్డి, లీగల్ సెల్ నాయకుడు పసుమర్తి వెంకటరావు, వైస్ ఎంపీపీ షేక్ చిన్న మస్తాన్, ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, నుసుం ప్రతాప్ రెడ్డి, గోగులముడి లింగారెడ్డి, బోరిగర్ల శ్రీను, సాదం నారయ్య, గొట్టిపాటి బాల కోటయ్య, షేక్ జానీ, షేక్ సుభాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ యూసఫ్, కండె గంగయ్య తదితరులు పాల్గొన్నారు.








