
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన జరగనున్న మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి తిరుణాల ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని తిరుణాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుణాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జనసేన నాయకులు నిస్శంకర శ్రీనివాసరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.







