Mutukula
బొల్లాపల్లి మండలం ముటుకుల గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి తిరుణాల సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా రోటరీ క్లబ్ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం యేరువ బ్రహ్మయ్య, హుస్సేనయ్య కుటుంబ సభ్యుల సహకారంతో భక్తులకు మజ్జిగ, పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు యేరువ వెంకటనారాయణ, కోశాధికారి పొత్తూరి నవీన్ సుధాకర్, మాజీ అసిస్టెంట్ గవర్నర్ ఆలా శ్రీనివాసరావు తదితరులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.







