
నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సాతులూరు రైల్వే స్టేషన్ వద్ద గురువారం ఒక వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. మృతుడు కాషాయం రంగు దుస్తులు ధరించి ఉన్నాడు. అతను భిక్షాటన చేసే వ్యక్తిగా కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు
.






