
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుడిని మూలకలూరు గ్రామానికి చెందిన శ్యామ్ సోన్ (28) గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ముందుగా 108 అంబులెన్స్ ద్వారా పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.స్థానికుల వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన ధనుంజయ్ వినుకొండకు వస్తూ మార్గమధ్యంలో తలార్లపల్లికి చెందిన మరియమ్మను తన వాహనంపై ఎక్కించుకున్నాడు. ఇదే సమయంలో వినుకొండ నుండి మొలకలూరు వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ధనుంజయ్ గాయపడినట్లు సమాచారం.పండగ రోజునే ఇలాంటి దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






