
పల్నాడు జిల్లా: నూజెండ్ల మండలంలోని టీ అన్నవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భీమనాధం అభిలాష్ (18) అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు

.
స్థానికుల సమాచారం ప్రకారం, సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లిన అభిలాష్ ఈత కొడుతుండగా అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన వారు వెంటనే బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






