

రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. పాఠశాలల్లో తాగునీరు, నీడ, ప్రాథమిక వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని అధికారులు సూచించారు.పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు: పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ఉన్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయి. విద్యార్థులు సమయానికి హాజరుకావాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.అలాగే పరీక్షల సమయం దగ్గరపడుతున్నందున 10వ తరగతి విద్యార్థులు పునశ్చరణపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.వేసవి సెలవులు: వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయి. జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త విద్యాసంవత్సరానికి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని పాఠశాలలకు సూచనలు జారీ చేశారు.





