Village News

శావల్యాపురంలో రెండు ఆటోలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

శావల్యాపురం నుంచి గంటవారిపాలెం వెళ్లే మార్గంలో సోమవారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నరసరావుపేట నుంచి వినుకొండకు ఇంటి సామాన్లతో వెళ్తున్న ఆటోను మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

↑ కొత్త వార్తపైకి స్వైప్ చేస్తే పాత వార్త↓ పాత వార్త