
పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని పెద్ద తురకపాలెం గ్రామంలో వైసీపీ సర్పంచ్ ఆరిఫ్ భాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఒక కేసులో సాక్షిగా ఉన్న కారణంగా ప్రత్యర్థులు తనను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, స్థానికులు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. గాయపడిన ఆరిఫ్ భాషాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.







