
వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో సోమవారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రీసర్వే పూర్తయిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా అందజేశారు. రీసర్వే ద్వారా భూ వివాదాలు తగ్గి, రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు భరోసానిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నిశంకర్ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు







