
వినుకొండ పట్టణం కొత్తపేటలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు నియోజకవర్గ ప్రజల నుండి వినతులను స్వీకరించనున్నారు.
ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలు మరియు అభ్యర్థనలను నేరుగా ప్రభుత్వ చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించినట్లు కార్యాలయ వర్గాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
.







