
వినుకొండ:పల్నాడు జిల్లా వినుకొండలో రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు భోజనశాల ప్రారంభించనున్నారు. ఈ భోజనశాల ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2026 సోమవారం ఉదయం 11 గంటలకు వినుకొండ శివయ్యగారి స్థూపం సమీపంలో, MDO కార్యాలయం ఎదురుగా జరగనుంది.పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కూలీలకు అందుబాటు ధరలో భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ భోజనశాలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేవలం రూ.45కే అన్నం, పప్పు, ఆకుకూరలు మరియు ఇతర వంటకాలతో నాణ్యమైన భోజనం అందించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, దాతలు మరియు గ్రామస్థులు హాజరుకానున్నారు. ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని రైతు మిత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.








