
వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ రాయల శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్–2026 అవార్డు కార్యక్రమంలో ఆయనకు వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది.ఈ అవార్డును ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ సీఆర్ సత్యనారాయణ, ఎస్ఏపీ చైర్మెన్ ఎం.సి. శేఖర్, ఎడిట్ పాయింట్ రమేష్, అభిమన్యు చేతుల మీదుగా శ్రీకాంత్ అందుకున్నారు.వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు ఆల్బమ్ డిజైన్ రంగంలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న రాయల శ్రీకాంత్‌కు ఈ అవార్డు రావడం వినుకొండ ప్రాంతానికి గర్వకారణమని స్థానికులు అభినందిస్తున్నారు.







