
గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం “డా. లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్” ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు. కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ మరియు డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ డా. లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించేందుకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్తో పాటు పూర్తిగా ఉచిత కోచింగ్ మరియు అధ్యయన మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్పీ సునీల్ తన విజయ ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.







