
నూజండ్ల మండలం చింతలచెర్వు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న సమయంలో ఆమె చీర కొంగు వాహనం వెనుక చక్రంలో చిక్కుకోవడంతో ఆమె వాహనం పై నుంచి కిందపడింది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను వినుకొండ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి స్వల్ప గాయాలే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం.ఈ ఘటనపై ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో చీర కొంగు లేదా పొడవైన దుస్తులు చక్రాలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనంపై కూర్చునే ముందు దుస్తులు సరిచేసుకోవడం, సాధ్యమైనంత వరకు సేఫ్టీ గార్డ్ ఉన్న వాహనాలను ఉపయోగించడం మంచిదని తెలిపారు.







