

వినుకొండ: వినుకొండ నగర శివారు నరసరావుపేట రోడ్డులోని చెక్కవాగు పక్కన ఉన్న శ్రీ శనిదేవుడు మరియు బాణలింగేశ్వర స్వామి వారల ఆలయంలో ఆదివారం నిత్యాభిషేకం కార్యక్రమం భక్తుల సందోహంలో నిర్వహించారు. మాఘ బహుళ సప్తమి సందర్భంగా నిర్వహించిన ఈ అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రధాన అర్చకులు జానపాటి పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనార్థం తెరిచి ఉంచుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.







