ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు పచ్చని రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం వినుకొండ పట్టణంలోని NSP మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రజా వేదిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా ఆధ్వర్యంలోని జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే కార్యక్రమ విజయానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ వినుకొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు జీవి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.







