Lakshmi tirupathamma tirunalla
నూజండ్ల:
మండల పరిధిలోని తలార్లపల్లి (ఓబన్నపాలెం) గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోవయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, ఆది పరాశక్తి అంకమ్మ తల్లివారి తిరునాళ్ల మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
తెల్లవారుజామున నుంచే సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతలను దర్శించుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోణాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు పొంగళ్లు చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించారు.
రాత్రి నిర్వహించిన భజనలు, కోలాటం, బ్రహ్మంగారి నాటకం భక్తులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్ల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







