
మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం కేవలం ఆధ్యాత్మిక పరమైన ఆచారం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.కొంతకాలం ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుందని, దీంతో శరీరంలోని కొంత మలినాలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఉపవాసం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం కావడం, గుండె ఆరోగ్యానికి కొంతవరకు మేలు కలగడం వంటి ప్రయోజనాలు కూడా ఉండవచ్చని తెలిపారు.అయితే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లేదా వృద్ధులు ఉపవాసం చేయడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరమని నిపుణులు పేర్కొన్నారు.







