
వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ చాటుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. హైదరాబాద్లోని కె.బి.యన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు Wedding Photography Business Excellence Award ప్రదానం చేశారు.ఫోటో పరివార్ ఇండియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ఆనంద్, ప్రొఫెసర్ కామల్రాయ్, ఇప్పలపల్లి రమేష్, ఫోటోటెక్ అభిమాన్యూ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ అవార్డు అందుకోవడం పట్ల బ్రహ్మం ఆనందం వ్యక్తం చేయగా, వినుకొండ ప్రాంత ప్రజలు మరియు ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వారు ఆయనను అభినందించారు.







