
వినుకొండ: పట్టణంలోని బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం చోరీ యత్నం జరిగింది. కుమ్మరి బజార్ కు చెందిన దంపతులు నీలంపాటి అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉండగా, వారి మొబైల్ ఫోన్‌తో పాటు సుమారు ₹1500 నగదు అపహరించబడింది.ఈ ఘటనలో దొంగల్లో ఒకరు మొబైల్ ఫోన్, డబ్బులతో పరారవగా, మరో ఇద్దరిని స్థానికులు పట్టుకుని వినుకొండ పట్టణ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ఏడు సంవత్సరాల మైనర్ బాలుడు కూడా ఉండడం గమనార్హం.గతంలో కూడా వీరు పలుమార్లు వివిధ దొంగతనాల కేసుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







