వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో మద్యం దుకాణం ఏర్పాటు విషయంపై సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తమ నివాసాల సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని మహిళలు డిమాండ్ చేశారు.కాలనీలో కుటుంబాలు, చిన్నారులు ఎక్కువగా నివసిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం షాపును ఇతర ప్రాంతానికి మార్చాలని సిపిఐ నాయకులు, మహిళలు కోరుతున్నారు.మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది







