
వినుకొండ పట్టణంలోని స్తూపం సోమవారం సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది. టాయిలెట్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై బాత్రూంలోనే మృతి చెందినట్లు సమాచారం.కొంతసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపు తట్టి స్పందన లేకపోవడంతో తలుపు తెరిచి చూడగా వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







