
వినుకొండలో మహిళ మృతి.. బంధువులు వదిలివెళ్లిన ఘట
వినుకొండ: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డుకు చెందిన బోడ్డిపల్లి మహాలక్ష్మి (భర్త: సాయి రామ్) ఈ నెల 14వ తేదీన అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 21న మృతి చెందినట్లు సమాచారం.
అయితే, మృతురాలిని ఆమె బంధువులు ఆసుపత్రిలోనే వదిలివెళ్లినట్లు తెలిసింది.
ఈ ఘటనపై సమాచారం అందిన వినుకొండ పోలీసులు, మృతురాలి బంధువుల వివరాలు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు. ఎవరైనా సమాచారం తెలిసిన యడల వినుకొండ పోలీస్ స్టేషన్ SHO ను 9440796248 నంబర్లో సంప్రదించవచ్చు.







1 thought on “వినుకొండలో మహిళ మృతి.. మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు”
Comments are closed.