వినుకొండ పురపాలక సంఘ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పరిపాలనా మార్పుల్లో భాగంగా ఈ బదిలీ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో ప్రస్తుతం విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శివరామ్ ప్రసాద్‌ను నూతన మున్సిపల్ కమిషనర్‌గా నియమించినట్లు సమాచారం అందింది.సుభాష్ చంద్రబోస్ వినుకొండలో కమిషనర్‌గా పనిచేసిన కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ పరిశుభ్రత చర్యలు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన బదిలీతో పట్టణ ప్రజలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.ఇక నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న శివరామ్ ప్రసాద్ త్వరలో వినుకొండకు చేరుకుని బాధ్యతలు చేపట్టనున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు వినుకొండలో విధులు నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ వారం రోజుల్లో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం







