
పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా కోడూరు శివరామ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను వినుకొండ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం కమిషనర్‌ను మున్సిపల్ మేనేజర్ అర్జునరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, ఆర్ఐ మణికంఠ, ఏఈ ఆదినారాయణతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.నూతన కమిషనర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.







