
వినుకొండ నుండి నూజెండ్లకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు భారీగా చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌పాస్‌లో నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోంది.నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై గుంతలు ఏర్పడి కనిపించకపోవడంతో కొంతమంది వాహనదారులు జారి పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.స్థానికులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అండర్‌పాస్‌లో నిల్వైన నీటిని తొలగించి, గుంతలను పూడ్చి రాకపోకలు సురక్షితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






