
వినుకొండ: నగర శివారులోని నరసరావుపేట రోడ్డులో చెక్కవాగు పక్కన ఉన్న శనిదేవుడు, బాణలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం (ఫిబ్రవరి 7) మాఘ బహుళ షష్ఠి సందర్భంగా నిత్యాభిషేక కార్యక్రమం భక్తజన సందోహం మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనార్థం తెరిచి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రధాన అర్చకులు జానపాటి పరమేశ్వర స్వామి భక్తులను దర్శనానికి ఆహ్వానించారు.








