
వినుకొండ నగర శివారులోని నరసరావుపేట రోడ్డులో, చెక్క వాగు పక్కన ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చర స్వామి దేవస్థానంలో శనివారం (14 ఫిబ్రవరి 2026) మాఘ బహుళ ద్వాదశి సందర్భంగా నిత్యాభిషేక కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శనిదేవుడు మరియు బాణ లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.దేవస్థానం ప్రధాన అర్చకులు జానపాటి పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థనలు చేశారు.ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుందని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. స్థానికులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు.








